Thursday, June 17, 2010

గతం ...అది నేర్పే పాఠాలు

ఒక కుటుంబానికైనా గ్రామానికైనా జాతికైనా దేశానికైనా భవిష్యత్తు అనేది దాని గతం పైనే ఆధారపడి ఉంటుంది.గతం నుండి గుణపాఠాలు నేర్చుకోని జాతి మనుగడ చాల సందర్భాలలో ప్రశ్నార్థకమే.భారత ప్రభుత్వం 1984 భోపాల్ దుర్ఘటనలో జాతి ప్రయోజనాలను కాపాడటం లో విఫలమైందనడం నిర్వివాదాంశం.బాధ కలిగించే విషయం ఏమిటంటే మన నాయకులు తప్పు ను ఒప్పుకోవడానికి ఇంకా సందేహిస్తున్నారు, తప్పును న్యాయ వ్యవస్త పైన తోసేసి తప్పించుకోవడానికి చూస్తున్నారు.భారతీయులకున్న అతిపెద్ద జాడ్యం ఏమిటంటే వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పరిస్తితులను అవి కాకపోతే మరేదో విషయాలను సాకుగా చూపించడం.ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి దొరికిన అలాంటి సాకు న్యాయవ్యవస్థ.

చివరిసారిగా ఒక భారతీయుడు తనను గౌరవంగా సంబోధించాలని ఒక విదేశీయుడిని ధైర్యంగా అడిగిన సందర్భం 326 BC.జీలం నదీ ఒడ్డున అలెగ్జాండర్ పురుషోత్తముడిని ఓడించినప్పుడు(కొందరు చరిత్ర కారులు ఈ యుధ్ధంలో పురుషోత్తముడే గెలిచాడని వాదిస్తారు)నిన్ను ఏమని సంబోధించాలని అడిగాడట, అందుకు జవాబుగా పురుషోత్తముడు నన్ను చక్రవర్తి అని పిలవాలని అన్నాడట.ఇది యదార్థం కాకపోవచ్చు, కాని దీని నుంచి మనం నేర్చుకోవలసిన నీతి మాత్రం ఉంది,పరాయి వాళ్ళు నిన్ను ఎలా పిలవాలి ఎలా గౌరవించాలి అన్నది మన చేతుల్లోనే ఉంతుంది, మనం బానిసగా ఉండాలా చక్రవర్తి లా ఉండాలా అన్న చాయిస్ మనకు ఎప్పుడూ ఉంటుంది.కాని మన చరిత్రను ఒక సారి తిరగేస్తే ఎక్కడ చూసినా మోసాలు ఓటములే కనిపిస్తాయి అది టెరాయిన్,పానిపట్,ప్లాసీ, శ్రీ రంగ పట్నం ఇప్పుడు భోపాల్.

భోపాల్ తీర్పు వచ్చిన తర్వాత దేశం లో, మీడియా లో పెద్ద యెత్తున దీనిపై చర్చలు జరిగాయి,ప్రజల ఆగ్రహం ఆవేదన వ్యక్తమైంది.యూనియన్ కార్బైడ్ కు వాళ్ళు ఉపయోగిస్తున్న రసాయన పదార్థాలు ఎంత ప్రమాద కరమైనవో తెలుసు.ఆ కర్మాగారం లో ఉపయోగించిన టెక్నాలజీ చాలా నాసి రకమైనది.ఈ కర్మాగారం నుండి వెలువడే మిథైల్ ఐసో సయనేట్ దారునమైన ప్రమాదాలకు కారణం కావచ్చని అమెరికాలో ఉన్న యాజమాన్యం అక్కడి కర్మాగారానికి తెలియచేసి, దాన్ని నివారించడానికి తగిన ఏర్పాట్లు చేసి ఉంచారు. కాని అదే భారత్ లో ఉన్న తమ శాఖకు ఎలాంటి సమాచారాన్ని అందించకుండా ఉండటం లో అర్థం ఏమిటి/ కొన్ని డాలర్లను మిగిలించుకోవడం మాత్రమే.కాబట్టి ఖచ్చితంగా జరిగిన ప్రమాదానికి కంపని యాజమాన్యం బాధ్యత వహించల్సి ఉంటుంది.

ప్రమాదం జరిగిన తర్వాత దేశ ప్రభుత్వం బాధితులకు అందాల్సిన కనీస నష్ట పరిహారాన్ని అందించడం లో పూర్తిగా విఫల్కం అయ్యింది.మన వ్యవస్త ఎనత నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటే కంపనీ యాజమాన్యం బాధితులకు కేవలం 500 డాలర్ల పరిహారం ఇవ్వచూపింది.ఒక మనిషి జీవితం విలువ కేవలం 500 డాలర్లా?ఈ మధ్య గల్ఫ్ మెక్సికో లో జరిగిన ఆయిల్ ప్రమాదానికి బ్రిటిష్ పెట్రోలియం కంపనీ నుండి కొన్ని బిలియన్ డాలర్ల పరిహారాన్ని రాబట్టడానికి రంగం సిద్దమైంది.1988 లో పాన్ అమెరికా విమానాన్ని పేల్చడానికి పేలుడు పదార్థాలను సరఫరా చేసినందుకు లిబియా నేత గడాఫి నుంచి బ్రిటన్ ప్రభుత్వం రాబట్టిన నష్టపరిహారం మొత్తం 800 మిలియన్ పౌండ్లు.వీటిని 147 బాధిత కుటుంబాలకు పంచారు.భోపాల్ ఉగ్రవాద చర్య కాదు కదా అని వాదించవచ్చు కాని అది యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా రక్షణ చర్యలను తీసుకోకపోవడం మూలాన జరిగిన ఘటన.ఇది కూడా ఖచ్చితంగా క్రిమినల్ నేరమే.మనం ఇచ్చే నష్ట పరిహారం చనిపోయిన వాళ్ళను తిరిగి బతికించలేదు, కనీసం ఆయా కుటుంబాలు తమ భవిష్యత్తుని బాగుపరచుకోవడానికి తగినంత పరిహారం ఇవ్వడం ఈ జాతి బాధ్యత.

అయితే ఎక్కువ నష్టపరిహారం కోసం డిమాండ్ చేస్తే భారత్ అమెరికా ల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతింటున్నయని కొందరు వాదిస్తున్నారు. వారు ఇక్కడ ఒక్క విషయం గమనించాలి అమెరికా ప్రతి వస్తువు ను అది ఆయుధాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అంతర్జాతీయ మార్కెట్ లో దాని విలువను బట్టె మనకు అమ్ముతోంది.మిత్ర దేశం కదా అని మనకు తక్కువ ధరలకు ఏమీ అమ్మడం లేదు.కాబట్టి మనం తగినంత నష్టపరిహారం కోసం డిమాండ్ చేయడం లో తప్పు లేదు.మన దేశ ప్రజల ఆవేదన మాత్రమే కాదు ఈ దేశ పరువు ప్రతిష్ట కూడా దీని పైన ఆధార పడి ఉంది.

భోపాల్ విషయం లో ఒక జాతి గా మనం విఫలం అయ్యాము.ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తు లో మళ్ళి జరగవని మనం ధైర్యంగా చెప్పే పరిస్థుతులలో ఉన్నామా? త్వరలోనే మనకు ఇంకో పరీక్ష ఎదురు కాబోతోంది న్యూక్లియర్ లైయబిలిటీ బిల్ రూపం లో,
మరి మనం గుణపాఠాలు నేర్చుకుంటామా? లేక ఎప్పటిలాగే గతాన్ని మర్చిపోయి ముందుకు వెళ్తామా, ఏది ఏమైనా బంతి ఎప్పటికీ మన కోర్టు లోనే ఉంటుంది.

8 comments:

  1. "భోపాల్ విషయం లో ఒక జాతి గా మనం విఫలం అయ్యాము." - సరైన దారిలో ఆలోచిస్తున్నారు. మీకు నా అభినందనలు.

    మంచి టపా. గుణపాఠాలైతే నేర్చుకోవలసిందే. ఒక జాతిగా మనం 25 సంవత్సరాల కింద ఈ అన్యాయానికి ఇప్పుడవుతున్నంత రియాక్ట్ అవ్వలేదేమో అనిపిస్తుంది.

    మీరన్నట్లు, బంతి మన కోర్టులోనే ఉంటుంది. ఒక జాతిగా మనం నిర్ణయించుకోవాలి.. కేవలం మరొకరి కోర్టులోకి నెట్టేద్దామా లేక గోల్ పోస్టు వైపుకి ఆడేద్దామా అని!

    ReplyDelete
  2. వీకెండ్ పొలిటిషియన్ గారు థాంక్స్ అండి.25 సంవత్సరాల కింద ఇంతటి రియాక్షన్ ఎందుకు లేదన్నది నాకూ తెలీదు,ఎందుకంటే అప్పటికి నేను పుట్టి కొన్ని నెలలు మాత్రమే అయ్యిదనుకుంటా.ఒక రకంగా ఇలాంటి ప్రతి స్పందన, ఆగ్రహం ప్రజల నుండి వ్యక్తం అవ్వడం కూడా మనలో వస్తున్న మార్పును సూచిస్తుందేమో.

    ReplyDelete
  3. సావిరహే గారు నా రాతలు మీకు నచ్చినందుకు సంతోషం.
    welcome to my blog ;)

    ReplyDelete
  4. బాబు నిజం చెప్పు నీకు 25 ఆ 52ఆ

    ReplyDelete
  5. @తార గారు
    అంత పెద్ద సందేహం ఎందుకొచ్చిందండి? నాకు నిజ్జంగా పాతికే ;)

    ReplyDelete
  6. శతృవులు కోటని ముట్టడించాక, నమాజ్ కోసం రహస్య మార్గం నుంచి మసీద్ కి బుద్ది వున్నోడు ఎవడూ వెళ్ళడు, అలా వెళ్ళి రహస్య మార్గాన్ని బయటపెట్టి కుట్రతో ఓడిపోయాడు అనటం తప్పే, దానికి మనమే అవకాశం ఇచ్చాం కదా. (శ్రీరంగపట్నం)

    ఎంతో అనుభవంతో రాసినట్టు వున్నది టపా అందుకే అల అన్నాను, కానీ నా పొగడ్త నీకు అర్ధం కాలేదు. నే జిజ్ఞాసని సరిగ్గా ఉపయోగించుకో పైకి వస్తావు( కృషినే నమ్ముకో)

    ReplyDelete
  7. @Taara gaaru,

    thanks for ur complements n blessings :)

    ReplyDelete