Saturday, January 22, 2011

అంతా మాయ

మాట్రిక్స్ సినిమా తెలుగులో చూస్తె తప్ప అర్థం చేసుకోలేని మన కోడి బుర్రకు (పేటెంట్ రౌడీదే ) కొన్ని చిన్న చిన్న విషయాలు మామూలు గానే అర్థం కావు.మాట్రిక్స్ లో ఆ నల్ల గుండు బాబు చెప్పినట్టు నువ్వు చూసేది ఏదీ నిజం గాదు, నువ్వు తినే తిండి నీ ఆలోచనలు నువ్వు కలిసే వ్యక్తులు ఏది నిజం కాదు అంతా మాయ.సినిమా లోనే కాదు జీవితం లో కూడా అంతే మనం ఇది అని అనుకుంటే ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా జరుగుద్ది అని తెలిసున్న్నా అదే జరగాలనుకోవడం మూర్ఖత్వం కాదా?సో నేను చెప్పొచ్చే సోది ఏంటంటే దేని పైనా ఎక్కువ నమ్మకం పెట్టుకోవడం మంచిది కాదు.ఏదో ఒక రాయి వేశాం వస్తే కొండ పోతే వెంట్రుక అనేది బెస్టు పాలసీ.

ఇక మనుషులు నమ్మకాలు వీటి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది.బావా నీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను అంటే అర్థం మీకు అవసరం ఐనప్పుడు ఖచ్చితంగా ఆడు హాండ్ ఇవ్వడానికి ప్రాబబిలిటీ ఎక్కువనే అర్థం.అందుకే దేని పైనైనా ఎవరి పైనైనా మరీ ఎక్కువ నమ్మకాలు ఎక్కువ ఆప్యాయతలు పెట్టుకోవడం మంచిది కాదు.నాకైతే మొన్నటి రెండు రోజులు ఫుల్లు టైం పాస్ మాలిక లో, అందరు జేంస్ బాండ్ లెవెల్లో చుక్కల్ని కలుపుతూ మంచి మాస్ మసాలాల్ని మిక్స్ చేసి కామెంట్లు టపాలతో చించేశారు.వాళ్ళతో పోటీ పడుతూ సదరు వ్యక్తి కూడా ఏ మాత్రం అర్థం కాని టపాలను రాశాడు, అంత ఓపిక లేకపోవడం వల్ల మామూలు గానే మిగిలిన బ్లాగులు కామెంట్లు చదువుతూ కూర్చున్నా. ఐనా నన్ను నిరాశ పరిచిన విషయం ఏంటంటే ఎవరూ ఐ పి అడ్రస్సులూ స్క్రీన్ షాట్లూ ఇవ్వక పోవడం. ఈ మధ్య జనాలు సరిగ్గా పనిచేయట్లేదనుకుంటా I expected more masaalaa.

చివరి చమక్కు ఏంటంటే నా కొలీగు, సీనియర్ అనే ఫీలింగు తప్ప బుర్రలో మాటర్ లేని ఒకడు నిన్న పరిగెత్తుకుంటూ వచ్చి నీకో విషయం తెలుసా ఫలానా వాడు ఫేకు ఎక్స్పీరియన్సు పెట్టి వచ్చాడంట, నాకెప్పుడు అసలు ఆ సందేహమే రాలేదు అసలు ఎంత బాగా మేనేజ్ చేశాడు కదా అని బోలెడంత హాచ్చెర పడిపోయాడు. నేను ఓ నవ్వు నవ్వి అలాగా అని ఊరుకున్నా.మనోడు దీనికే ఇంత షాక్ తిన్నాడు ఇక నా గురించి తెలిస్తే ఏమౌతాడో అనుకొని have a great weekend సెప్పి బయటకొచ్చా.బతుకే మాయ ఐనప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఇంత బాధ పడితే ఎలా? ఐనా ఫేకులు లేకుండా ఇండస్ట్రీ నడుస్తుందా?ఫేకా జినైనా అని కాదనయ్యా ఇచ్చిన పని చేస్తున్నామా లేదా అన్నదే మాటర్.ఐనా ఎవడు ఫేకు కాదు?