Thursday, June 17, 2010

గతం ...అది నేర్పే పాఠాలు

ఒక కుటుంబానికైనా గ్రామానికైనా జాతికైనా దేశానికైనా భవిష్యత్తు అనేది దాని గతం పైనే ఆధారపడి ఉంటుంది.గతం నుండి గుణపాఠాలు నేర్చుకోని జాతి మనుగడ చాల సందర్భాలలో ప్రశ్నార్థకమే.భారత ప్రభుత్వం 1984 భోపాల్ దుర్ఘటనలో జాతి ప్రయోజనాలను కాపాడటం లో విఫలమైందనడం నిర్వివాదాంశం.బాధ కలిగించే విషయం ఏమిటంటే మన నాయకులు తప్పు ను ఒప్పుకోవడానికి ఇంకా సందేహిస్తున్నారు, తప్పును న్యాయ వ్యవస్త పైన తోసేసి తప్పించుకోవడానికి చూస్తున్నారు.భారతీయులకున్న అతిపెద్ద జాడ్యం ఏమిటంటే వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పరిస్తితులను అవి కాకపోతే మరేదో విషయాలను సాకుగా చూపించడం.ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి దొరికిన అలాంటి సాకు న్యాయవ్యవస్థ.

చివరిసారిగా ఒక భారతీయుడు తనను గౌరవంగా సంబోధించాలని ఒక విదేశీయుడిని ధైర్యంగా అడిగిన సందర్భం 326 BC.జీలం నదీ ఒడ్డున అలెగ్జాండర్ పురుషోత్తముడిని ఓడించినప్పుడు(కొందరు చరిత్ర కారులు ఈ యుధ్ధంలో పురుషోత్తముడే గెలిచాడని వాదిస్తారు)నిన్ను ఏమని సంబోధించాలని అడిగాడట, అందుకు జవాబుగా పురుషోత్తముడు నన్ను చక్రవర్తి అని పిలవాలని అన్నాడట.ఇది యదార్థం కాకపోవచ్చు, కాని దీని నుంచి మనం నేర్చుకోవలసిన నీతి మాత్రం ఉంది,పరాయి వాళ్ళు నిన్ను ఎలా పిలవాలి ఎలా గౌరవించాలి అన్నది మన చేతుల్లోనే ఉంతుంది, మనం బానిసగా ఉండాలా చక్రవర్తి లా ఉండాలా అన్న చాయిస్ మనకు ఎప్పుడూ ఉంటుంది.కాని మన చరిత్రను ఒక సారి తిరగేస్తే ఎక్కడ చూసినా మోసాలు ఓటములే కనిపిస్తాయి అది టెరాయిన్,పానిపట్,ప్లాసీ, శ్రీ రంగ పట్నం ఇప్పుడు భోపాల్.

భోపాల్ తీర్పు వచ్చిన తర్వాత దేశం లో, మీడియా లో పెద్ద యెత్తున దీనిపై చర్చలు జరిగాయి,ప్రజల ఆగ్రహం ఆవేదన వ్యక్తమైంది.యూనియన్ కార్బైడ్ కు వాళ్ళు ఉపయోగిస్తున్న రసాయన పదార్థాలు ఎంత ప్రమాద కరమైనవో తెలుసు.ఆ కర్మాగారం లో ఉపయోగించిన టెక్నాలజీ చాలా నాసి రకమైనది.ఈ కర్మాగారం నుండి వెలువడే మిథైల్ ఐసో సయనేట్ దారునమైన ప్రమాదాలకు కారణం కావచ్చని అమెరికాలో ఉన్న యాజమాన్యం అక్కడి కర్మాగారానికి తెలియచేసి, దాన్ని నివారించడానికి తగిన ఏర్పాట్లు చేసి ఉంచారు. కాని అదే భారత్ లో ఉన్న తమ శాఖకు ఎలాంటి సమాచారాన్ని అందించకుండా ఉండటం లో అర్థం ఏమిటి/ కొన్ని డాలర్లను మిగిలించుకోవడం మాత్రమే.కాబట్టి ఖచ్చితంగా జరిగిన ప్రమాదానికి కంపని యాజమాన్యం బాధ్యత వహించల్సి ఉంటుంది.

ప్రమాదం జరిగిన తర్వాత దేశ ప్రభుత్వం బాధితులకు అందాల్సిన కనీస నష్ట పరిహారాన్ని అందించడం లో పూర్తిగా విఫల్కం అయ్యింది.మన వ్యవస్త ఎనత నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటే కంపనీ యాజమాన్యం బాధితులకు కేవలం 500 డాలర్ల పరిహారం ఇవ్వచూపింది.ఒక మనిషి జీవితం విలువ కేవలం 500 డాలర్లా?ఈ మధ్య గల్ఫ్ మెక్సికో లో జరిగిన ఆయిల్ ప్రమాదానికి బ్రిటిష్ పెట్రోలియం కంపనీ నుండి కొన్ని బిలియన్ డాలర్ల పరిహారాన్ని రాబట్టడానికి రంగం సిద్దమైంది.1988 లో పాన్ అమెరికా విమానాన్ని పేల్చడానికి పేలుడు పదార్థాలను సరఫరా చేసినందుకు లిబియా నేత గడాఫి నుంచి బ్రిటన్ ప్రభుత్వం రాబట్టిన నష్టపరిహారం మొత్తం 800 మిలియన్ పౌండ్లు.వీటిని 147 బాధిత కుటుంబాలకు పంచారు.భోపాల్ ఉగ్రవాద చర్య కాదు కదా అని వాదించవచ్చు కాని అది యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా రక్షణ చర్యలను తీసుకోకపోవడం మూలాన జరిగిన ఘటన.ఇది కూడా ఖచ్చితంగా క్రిమినల్ నేరమే.మనం ఇచ్చే నష్ట పరిహారం చనిపోయిన వాళ్ళను తిరిగి బతికించలేదు, కనీసం ఆయా కుటుంబాలు తమ భవిష్యత్తుని బాగుపరచుకోవడానికి తగినంత పరిహారం ఇవ్వడం ఈ జాతి బాధ్యత.

అయితే ఎక్కువ నష్టపరిహారం కోసం డిమాండ్ చేస్తే భారత్ అమెరికా ల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతింటున్నయని కొందరు వాదిస్తున్నారు. వారు ఇక్కడ ఒక్క విషయం గమనించాలి అమెరికా ప్రతి వస్తువు ను అది ఆయుధాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అంతర్జాతీయ మార్కెట్ లో దాని విలువను బట్టె మనకు అమ్ముతోంది.మిత్ర దేశం కదా అని మనకు తక్కువ ధరలకు ఏమీ అమ్మడం లేదు.కాబట్టి మనం తగినంత నష్టపరిహారం కోసం డిమాండ్ చేయడం లో తప్పు లేదు.మన దేశ ప్రజల ఆవేదన మాత్రమే కాదు ఈ దేశ పరువు ప్రతిష్ట కూడా దీని పైన ఆధార పడి ఉంది.

భోపాల్ విషయం లో ఒక జాతి గా మనం విఫలం అయ్యాము.ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తు లో మళ్ళి జరగవని మనం ధైర్యంగా చెప్పే పరిస్థుతులలో ఉన్నామా? త్వరలోనే మనకు ఇంకో పరీక్ష ఎదురు కాబోతోంది న్యూక్లియర్ లైయబిలిటీ బిల్ రూపం లో,
మరి మనం గుణపాఠాలు నేర్చుకుంటామా? లేక ఎప్పటిలాగే గతాన్ని మర్చిపోయి ముందుకు వెళ్తామా, ఏది ఏమైనా బంతి ఎప్పటికీ మన కోర్టు లోనే ఉంటుంది.

Wednesday, June 16, 2010

ప్రథమ కెలుకుడు

ఒక బ్లాగు మొదలు పెట్టడం ఐతే ఐపోయింది కాని ఏమి రాయాలో తోచడం లేదు, రాసిన మనం రాసేది ఎవరు చదువుతారో లేదో నచ్చుద్దో లేదో అని ఒక డౌటు. ఇదంతా కూదరదు గాని బ్లాగు లోకంలో ఏ పదం కనిపిస్తే జనం పరిగెత్తుకుంటూ వస్తారో దాన్ని గురించి రాద్దామని డిసైడ్ అయిపోయాను.అదే కెలుకుడు గురించి. కాని కెలకడానికి మనకున్న ఎక్స్పీరియన్సు సరిపొద్దో లేదొ అని ఇంకొక డౌటు, సరే కాస్త అనుభవం వచ్చేదాకా చిన్న చిన్నగా కెలకడం మంచిదనిపించింది. మరి ఎవర్ని కెలుకుదాం? ఇది కొంచెం కష్టమైన సమస్య కాని సులువుగానే పరిష్కారం దొరికింది ఓం ప్రథమంగా కెలుకుడు బాచ్ నే కెలికితే పోలే?కాబట్టి కెలుకుడు బాచ్ లోని ఒక్కక్కరినే కెలుకుతూ పోదాం.

మలక్పేట రౌడి:
బ్లాగుల్లో కెలుకుడుకు ఈయనే ఆద్యుడు అని చెప్పుకుంటారు.అంతే కాకుండా ఆయన ఊత పదం ద్వార కూడా ప్రసిద్ది కెక్కారు, అదేమిటో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా అదేనండి LOOOOOOOOOOOOOL.ఇది ఎంత ఫేమస్ అయ్యిందంటే అదేదో బ్లాగ్లో అందరు బూతులు తిట్టుకుంటుంటే రౌడీని మాత్రం ఎంతో ప్రేమగా కోపంగా 'లోల్ గాడు'అని తిట్టడం జరిగింది, ఆయన ఊత పదానికున్న ఆదరణకు ఇంతకన్న తార్కాణం అక్కర్లెదనిపించింది.
శరత్కాలం:
బ్లాగు లోకపు సూరీడు కు ఈయన స్వయానా బావనని చెప్పుకుంటుంటారు.ఈయన గే/బై ఈ రెండు పదాలు వాడకుండా ఒక్కరోజు కూడ బ్లాగుల్లో బతకలేరని మెజారిటీ సభ్యుల అభిప్రాయం.కెబ్లాస సంస్థాపకుల్లో యీయన కూడా ఒకరైనప్పట్టికీ కొన్ని విభేదాల వల్ల బయటకు వచ్చేసి గెబ్లాస ను స్థాపించారు, చిరంజీవి ప్ర.రా.పా ను నడిపినట్టు యీయన ఒక్క చేత్తో గెబ్లాస ను నడుపుకొస్తున్నారు (ఉన్నది ఒక్కరే కాబట్టి పెద్ద శ్రమ కూడా పడటం లేదు లెండి).స్వయాన గోపి నని తనను తాను వర్ణించుకోనే శరత్ కెబ్లాసకు బయట నుంచి వ్యూహత్మక మద్దతు ఇస్తుంటారు.పైగా తాను తొడ కొట్టే టైపు కాదని తొడ గిల్లే టైపని ముసి ముసి నవ్వులతో చెప్తారు.
శ్రీనివాస్:
సుత్తి లేకుండ సూటి గా చెప్పాలంటే సదరు శీను గారు కెబ్లాస ఫైర్ బ్రాండ్ అని చెప్పచ్చు.పేరులో రౌడి ఉందని మలక్పేట మురిసి పోవచ్చుకాని అసలు రౌడీఇజమంతా శీనూదే అని కొందరి అభిప్రాయం.మన ఇంట్లో ఏదైనా వ్రతాలు జరిగితే వెళ్ళి తాంబూలం ఇచ్చి రమ్మని ఆహ్వానిస్తాం కదా, శీను గారు కూడా అలాగె అన్న మాట ఐతే వారి ప్రత్యేకత ఏమిటంటే తన్నుకోవడానికి తాంబూలాలు ఇవ్వడమే కాకుండా అందులో చురుకుగా పాల్గొంతారన్న మాట.
ఏకలింగం:
ఈయన గురించి మనకు పెద్దగా తెలీదు కాని, ఈయన ఆవిర్భావం మాత్రం చెప్పగలను.మన బ్లాగు లోకపు సూరీడు దశావతారాలలో ఒక్కటైన డాక్టర్ నాదెండ్ల జూనియర్ , లండన్ గారు కెబ్లాస తో అరివీర భయంకరంగా పోరాడుతుండగా నాదెండ్ల పాలిట బ్లాగు సైంధవుడి మాదిరి ఈయన వచ్చారన్న మాట.
రవిగారు:
రవి గారు కెబ్లాస లో చురుకైన సభ్యుడు కాక పోయినా ఈ రౌడీ మూక బ్లాగుల్లోకి రావడానికి కారణం మాత్రం రవి గారే అని ఒక నింద.అప్పుడప్పుడు రెడిఫ్ కోడ్ భాషలో మాట్లాడుతూ చదువరులకు తిక్క రేపుతుంటారు.

ఇంకా కొందరు సభ్యులు ఉన్నప్పట్టికి వారు ప్రస్తుతం సుషుప్త చేతనావస్త లో(కరెక్టుగా రాశానా?)ఉండటం మూలాన వారి గురించి రాయలేక పోతున్నాను ప్రస్తుతానికి.ఉంటా మరి ఆనంద కెలుకాయణం.

Wednesday, June 9, 2010

లాభం లేదండి ఈ దేశం బాగుపడదు

ఈ మధ్య కొన్ని బ్లాగులు వాటిలో వాదాలు మరి కొన్ని పోస్టులు చదివిన తర్వాత గమ్యం సినిమాలో ఒక సీన్ గుర్తు వచ్చింది.
GAMYAM
అందులో బ్రహ్మానందం ప్రమాదం జరిగిన చోట ఈ డైలాగులు చెప్తుంటాడు.మన సమాజం లో ఇలాంటి వాళ్ళకు కొదవలేదు. సమస్యలు లేని దేశం ఉండదు అసమానతలు లేని సమాజం ఉండదు.కాని వీళ్ళకు మన దేశం మాత్రమే ప్రపంచం లో అత్యంత పనికిమాలిన దేశంగా కనిపిస్తుంటుంది.వీళ్ళు ఎక్కడా మంచిని చూడలేరు ఎందుకంటే మనసులో ద్వేషభావాలు నిండిపోయిన వాళ్ళకు మంచి ఎక్కడా కనబడదు.ప్రతి సంస్క్రుతి వీళ్ళకు పనికి మాలినదిగానే కనిపిస్తుంది.పోనీ వీళ్ళు దేశాన్ని ఉద్దరించే పనులు ఏమైనా చెస్తారా అంటే అదిలేదు, చేసే వాళ్ళను సూటిపోటి మాటలతో వేధించడం, వళ్ళ నమ్మకాలను ఎగతాళీ చేయడం ఎంట్రా అంటే అది నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అనడం.

సమస్యలను చిటికెలో పరిష్కరించడానికి ఇది నలుగురున్న ఇల్లు కాదు, వంద కోట్ల జనాభా ఉన్న దేశం.దానికి కాస్త సమయం కావాలి, ఇలాంటి రాజకీయ నాయకులు, మేధావులని చెప్పుకొనే ఇలాంటి వెధవలు ఉన్న దేశానికి అది ఇంకా కష్టం, ఎందుకంటే వీళ్ళు చెసే పని అల్లా ఒక్కటే మానుతున్న గాయాలను మళ్ళీ మళ్ళీ కెలకడం, ప్రజల్లో ద్వేషాలను రెచ్చకొట్టడం. నా ద్రుష్టిలో వీళ్ళకు తాలిబన్లకు పెద్ద తేడా లేదు.మనం చేయగలిగిందల్లా ఇలాంటి పెంటకు దూరంగా ఉండటం.All we can do is ignore such fools.