Wednesday, June 16, 2010

ప్రథమ కెలుకుడు

ఒక బ్లాగు మొదలు పెట్టడం ఐతే ఐపోయింది కాని ఏమి రాయాలో తోచడం లేదు, రాసిన మనం రాసేది ఎవరు చదువుతారో లేదో నచ్చుద్దో లేదో అని ఒక డౌటు. ఇదంతా కూదరదు గాని బ్లాగు లోకంలో ఏ పదం కనిపిస్తే జనం పరిగెత్తుకుంటూ వస్తారో దాన్ని గురించి రాద్దామని డిసైడ్ అయిపోయాను.అదే కెలుకుడు గురించి. కాని కెలకడానికి మనకున్న ఎక్స్పీరియన్సు సరిపొద్దో లేదొ అని ఇంకొక డౌటు, సరే కాస్త అనుభవం వచ్చేదాకా చిన్న చిన్నగా కెలకడం మంచిదనిపించింది. మరి ఎవర్ని కెలుకుదాం? ఇది కొంచెం కష్టమైన సమస్య కాని సులువుగానే పరిష్కారం దొరికింది ఓం ప్రథమంగా కెలుకుడు బాచ్ నే కెలికితే పోలే?కాబట్టి కెలుకుడు బాచ్ లోని ఒక్కక్కరినే కెలుకుతూ పోదాం.

మలక్పేట రౌడి:
బ్లాగుల్లో కెలుకుడుకు ఈయనే ఆద్యుడు అని చెప్పుకుంటారు.అంతే కాకుండా ఆయన ఊత పదం ద్వార కూడా ప్రసిద్ది కెక్కారు, అదేమిటో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా అదేనండి LOOOOOOOOOOOOOL.ఇది ఎంత ఫేమస్ అయ్యిందంటే అదేదో బ్లాగ్లో అందరు బూతులు తిట్టుకుంటుంటే రౌడీని మాత్రం ఎంతో ప్రేమగా కోపంగా 'లోల్ గాడు'అని తిట్టడం జరిగింది, ఆయన ఊత పదానికున్న ఆదరణకు ఇంతకన్న తార్కాణం అక్కర్లెదనిపించింది.
శరత్కాలం:
బ్లాగు లోకపు సూరీడు కు ఈయన స్వయానా బావనని చెప్పుకుంటుంటారు.ఈయన గే/బై ఈ రెండు పదాలు వాడకుండా ఒక్కరోజు కూడ బ్లాగుల్లో బతకలేరని మెజారిటీ సభ్యుల అభిప్రాయం.కెబ్లాస సంస్థాపకుల్లో యీయన కూడా ఒకరైనప్పట్టికీ కొన్ని విభేదాల వల్ల బయటకు వచ్చేసి గెబ్లాస ను స్థాపించారు, చిరంజీవి ప్ర.రా.పా ను నడిపినట్టు యీయన ఒక్క చేత్తో గెబ్లాస ను నడుపుకొస్తున్నారు (ఉన్నది ఒక్కరే కాబట్టి పెద్ద శ్రమ కూడా పడటం లేదు లెండి).స్వయాన గోపి నని తనను తాను వర్ణించుకోనే శరత్ కెబ్లాసకు బయట నుంచి వ్యూహత్మక మద్దతు ఇస్తుంటారు.పైగా తాను తొడ కొట్టే టైపు కాదని తొడ గిల్లే టైపని ముసి ముసి నవ్వులతో చెప్తారు.
శ్రీనివాస్:
సుత్తి లేకుండ సూటి గా చెప్పాలంటే సదరు శీను గారు కెబ్లాస ఫైర్ బ్రాండ్ అని చెప్పచ్చు.పేరులో రౌడి ఉందని మలక్పేట మురిసి పోవచ్చుకాని అసలు రౌడీఇజమంతా శీనూదే అని కొందరి అభిప్రాయం.మన ఇంట్లో ఏదైనా వ్రతాలు జరిగితే వెళ్ళి తాంబూలం ఇచ్చి రమ్మని ఆహ్వానిస్తాం కదా, శీను గారు కూడా అలాగె అన్న మాట ఐతే వారి ప్రత్యేకత ఏమిటంటే తన్నుకోవడానికి తాంబూలాలు ఇవ్వడమే కాకుండా అందులో చురుకుగా పాల్గొంతారన్న మాట.
ఏకలింగం:
ఈయన గురించి మనకు పెద్దగా తెలీదు కాని, ఈయన ఆవిర్భావం మాత్రం చెప్పగలను.మన బ్లాగు లోకపు సూరీడు దశావతారాలలో ఒక్కటైన డాక్టర్ నాదెండ్ల జూనియర్ , లండన్ గారు కెబ్లాస తో అరివీర భయంకరంగా పోరాడుతుండగా నాదెండ్ల పాలిట బ్లాగు సైంధవుడి మాదిరి ఈయన వచ్చారన్న మాట.
రవిగారు:
రవి గారు కెబ్లాస లో చురుకైన సభ్యుడు కాక పోయినా ఈ రౌడీ మూక బ్లాగుల్లోకి రావడానికి కారణం మాత్రం రవి గారే అని ఒక నింద.అప్పుడప్పుడు రెడిఫ్ కోడ్ భాషలో మాట్లాడుతూ చదువరులకు తిక్క రేపుతుంటారు.

ఇంకా కొందరు సభ్యులు ఉన్నప్పట్టికి వారు ప్రస్తుతం సుషుప్త చేతనావస్త లో(కరెక్టుగా రాశానా?)ఉండటం మూలాన వారి గురించి రాయలేక పోతున్నాను ప్రస్తుతానికి.ఉంటా మరి ఆనంద కెలుకాయణం.

31 comments:

 1. :))

  వస్తా. మళ్ళొస్తా..

  ReplyDelete
 2. ఏకలింగం గురించి మీకు ఎక్కువ తెలియదా? మా తరఫున అందరికీ, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎవడిక్కావాలంటే వాడికి క్షమాపణలు చెప్పివస్తారు.

  ReplyDelete
 3. .పైగా తాను తొడ కొట్టే టైపు కాదని తొడ గిల్లే టైపని ముసి ముసి నవ్వులతో చెప్తారు.
  ________________________________________________

  నవ్వలేక పొట్ట పగిలేలా ఉంది

  ReplyDelete
 4. తొడకొట్టాలంటే నాకు భయ్యం - అది ఎక్కడ తగిలి ఎక్కడ వాచిపోతుందో అని ఎప్పుడో చెప్పా కదా. 'పిర్ర గిల్లి పంచాయతీ పెట్టుకోవడం' అన్న సామెత తెలుసు కదా. అద్దీ మనం.

  ReplyDelete
 5. @శరత్ 'కాలమ్' గారు

  తెలుసు లెండి మీరు అన్నింటి లోను వ్యూహాత్మకంగా ఉంటారు కదా!!

  ReplyDelete
 6. @రౌడీని మాత్రం ఎంతో ప్రేమగా కోపంగా 'లోల్ గాడు'అని తిట్టడం జరిగింది,

  loooooooooooooooooool

  ReplyDelete
 7. :)

  @శరత్
  ఈ క్షమాపణల లొల్లి ఇంకా ఐపోలేదా?

  ReplyDelete
 8. @ ఏకలింగం
  మీరు మాకందరికీ ముచ్చటగా, మూకుమ్మడిగా అపాలజీ చెప్పేదాకా ఈ లొల్లి ఆగదు. అపాలజీ పవన్ ఎక్కడ వున్నా తొందరగా రావాలోచ్.

  ReplyDelete
 9. నాగప్రసాద్ సరదా కెలుకుడు పోస్టులు వేసి కెలికేశ్వర స్వామి అవతారంగా భాసిల్లేవాడు కానీ ఎందుకో ఈమధ్య బాగా సైలెంట్ అయిపోయాడు.

  ReplyDelete
 10. అవును ఈ అపాలజీ స్టార్ట్ చేసింది పవన్ కదూ

  ReplyDelete
 11. కులాల కుమ్ములాట చల్లబడ్డదా? అప్పుడే టాపిక్ డైవర్ట్ చేసారు?
  కెలకమ్మ తల్లి పేరు మీద బ్లాగుల్లో కులమార్పిడి చేసి అందర్నీ కెలుకులం లో కలుపుకుంటే బాగుంటుంది కదా?

  ReplyDelete
 12. అందుకే కదా గడ్డిపూలు సుజాత గారిదీ కెలుకులం అని శ్రీను డిక్లేర్ చేసిపారేసారు.

  ReplyDelete
 13. "పేరులో రౌడి ఉందని మలక్పేట మురిసి పోవచ్చుకాని అసలు రౌడీఇజమంతా శీనూదే అని కొందరి అభిప్రాయం"

  హన్నా మా రౌడీ నే అంత మాట అంటారా??

  ReplyDelete
 14. LOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOL


  కేకో కేక ..!!!!!!!!! Great post dude!

  ReplyDelete
 15. As Sreenu said,

  This is what you call 'Wholesome' Keludu!!

  Lemme repeat what otehrs already said - WAY TO GOOOOO!

  ReplyDelete
 16. సామూహిక మానభంగం లాగా సమూహిక కెలుకుడు అన్నమాట!

  ReplyDelete
 17. @ఏకలింగం గారు
  ;) welcome
  @ sarath,Srinivas,rowdy gaaru

  thanks to all ;)

  ReplyDelete
 18. @ karthik garu & ganesh gaaru

  thank you ;)

  ReplyDelete
 19. ఈ శరత్తుకి తెలుగవరైనా నేర్పించండయ్యా బాబూ! సామూహికమంటే, పదిమంది కలిసి చెయ్యడం. ఇక్కడ ఒక్కడే పదిమందిని కెలికాడు కదా, సామూహికానికి రివర్సు .. మూసాహికం అందామా? అసలే తెలుగులో కొత్త పదాలు సృష్టించడం ఏకలింగానికి భలే ఇష్టం :))

  ReplyDelete
 20. andaru kalisi gaddipoolu lo tapaa ni lepeyinchaaru gaa ;-)

  ReplyDelete
 21. welcome venkat..

  kelukudulo Phd praaptirastu ;-)

  ReplyDelete
 22. అవును కదా. ఏదో కెలుకుడు పోస్టు వ్రాసారు - కొద్ది రోజులు పండుగ చేసుకోవచ్చనుకున్నాను కానీ గడ్డిపూలు టపా ఎగిరిపోయింది. ఆ నేరం నాది కాదు రౌడీదే - 50 కామెంట్లు పూర్తి చేసి ఆ టపా సాగనంపాడు :))

  ReplyDelete
 23. @శరత్ గేరు
  ______________________
  ఆ నేరం నాది కాదు రౌడీదే
  _____________________
  ఆ నేరం రౌడీ ది + శిష్యుడిది అనుకుంటా ...

  ReplyDelete
 24. Jeevani gaaru thanks andi ;)

  @ srinivaas gaaru

  daaniki artham entandi?

  ReplyDelete
 25. నేను ఈ చుట్టూ పక్కలే తురుగుతూ ఉనా అని అర్ధం

  ReplyDelete